పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు మూర్ఖత్వం..

23 Apr, 2018 19:41 IST|Sakshi
టీడీపీ నేత, మంత్రి అయ్యన్న పాత్రుడు(పాత చిత్రం)

తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు పంచాయితీ కార్యాలయంలో జరిగిన సభలో పవన్, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని పవన్ కల్యాణ్ అంటున్నాడు..అది మూర్ఖత్వంగా అనిపిస్తోందన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లింది రాష్ట్రాభివృధ్ధికోసమే..ఎన్నాళ్లని కాళ్లు పట్టుకుంటాం..అందుకోసమే పోరాటం చేస్తున్నామని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘ నీకేమయ్యింది ఒక సినిమాలో నటిస్తే 10 నుంచి 30 కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు నీ పెళ్లాలు సంతోషంగా ఉంటారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు నష్టపోతారు.  మిత్రధర్మం ముగిసిన తర్వాత మా కార్యకర్తలను కాపాడుకోవాలి కదా అందుకే తాడేపల్లిగూడెం వచ్చాను. నన్ను అడగకుండా నా నియోజకవర్గానికి రావద్దని మాణిక్యాల రావు అనేవారు. మిత్ర ధర్మం ముగిసిపోయింది. ఇక నుంచి 15 రోజుల కొకసారి తాడేపల్లిగూడెం వస్తాను. ఇక్కడి కార్యక్రమాలు నా భుజాన వేసుకుంటాను. 

మాణిక్యాల రావు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి జరిగిందని, లోకేష్ ఎన్నోకోట్ల రూపాయలు తినేశాడని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడని, ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ చెబితే కానీ అవినీతి నీకు కనపడలేదా ? నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రక్కన మంత్రిగా పనిచేసినపుడు కనపడని అవినీతి మంత్రి పదవి పోగానే తెలిసిందా.  పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఎంక్వైరీ వేయమంటావా, నీకు దమ్ముంటే అవినీతి నిరూపించు, దేవాదాయశాఖ మంత్రిగా నీకు భక్తి ఉంటే రుజువు చెయ్‌. రాజకీయాలు వదలి మేము వెళ్లిపోతాం’  అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు