రాజ్యసభ ఎన్నికలు : చెల్లని ఓట్లు టీడీపీవే

19 Jun, 2020 18:17 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 173 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్‌ సందర్భంగా ఓ ఎమ్మెల్యే బ్యాలెట్‌ పేపర్‌పై రాసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును ప్రశ్నించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ‘గెలిచేటప్పుడు చంద్రబాబు కులానికి, ఓడిపోయేటప్పుడు దళితులకు ఇచ్చేది?’ అని బ్యాలెట్‌ పేపర్‌పై రాశారు. అయితే అలా రాసిన ఎమ్మెల్యే ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

మరోవైపు పోలైన 173 ఓట్లలో నాలుగు చెల్లనివిగా లెక్కింపు అధికారులు గుర్తించారు. ఆ నాలుగు ఓట్లు టీడీపీ ఎమ్మెల్యేలకు చెందినవని తెలిసింది. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. రిమాండ్‌లో ఉండటం ఎమ్మెల్యే అచ్చెన్నాయడు, కరోనా స్వీయ నిర్భంధంలో ఉండటం అనగాని సత్యప్రసాద్‌లు ఓటు వేయలేదు.

మరిన్ని వార్తలు