అది ఏపీ భవనా లేక టీడీపీ భవనా?

11 Feb, 2019 08:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్‌ను చూస్తే అది టీడీపీ భవనా? అనే సందేహం కలుగుతోంది. సరిగ్గా ఎన్నికల ముందు ధర్మపోరాట దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరలేపిన సీఎం చంద్రబాబు నాయుడు.. నేడు ఏపీ భవన్‌లో ఆ దీక్ష చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలుగుతమ్ముళ్లు.. అత్యుత్సాహంతో ఏపీ భవన్‌ను ఏకంగా టీడీపీ భవన్‌గా మార్చేశారు. భారీ ఎత్తున పార్టీ ప్రచార పోస్టర్లు.. ప్లెక్సీలతో అంతా పసుపుమయం చేశారు.

అంతేకాకుండా చంద్రబాబు ఆర్మీ పేరిట ఉన్న టీషర్ట్‌లతో ఏపీ భవన్‌ ప్రాంగణంలో హల్‌చల్‌ చేస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్‌ సందర్శకులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇదేదో టీడీపీ సొత్తయినట్లు ఇలా చేస్తున్నారేంటని,  పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును వాడుకోవడం ఏంటని విసుక్కుంటున్నారు. మరోవైపు ఏపీ భవన్‌ అధికార యంత్రాంగం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తల సేవలో మునిగి తేలుతోంది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబు ఓ మోసకారి 

వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక ప్రచారం!

రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..

మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు

‘టీఆర్‌ఎస్‌లో సైనికుడిని’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మర్‌లో షురూ

అంతా ఉత్తుత్తిదే

కాంబినేషన్‌ కుదిరింది

వేలానికి  శ్రీదేవి  చీర 

కొత్త దర్శకుడితో?

హేమలతా లవణం