‘ఎలాంటి హోదా ఇస్తారో రాహుల్‌ చెప్పాలి’

4 Apr, 2019 10:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఎలాంటి హోదా ఇస్తారో చెప్పడంలేదని బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ ఛీప్‌ సెక్రటరీ ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీఎస్పీ ఛీప్‌ మాయావతి పరిశ్రమలకు రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తారా రాయితీలు లేని హోదా ఇస్తారో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమలకు రాయితీలు లేని ప్రత్యేక హోదా ఇస్తే దాని కంటే ప్యాకేజీ బెటరన్నారు.

చంద్రబాబు హోదాపై మాట్లాడి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మేనిఫేస్టో విడుదల చేయని చంద్రబాబు ఓట్లు ఎలా అడుతారని ప్రశ్నించారు. పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్వల్పకాలిక ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని కోరారు. కులాలు వారిగా ఏర్పాటు చేసిన కొర్పొరేషన్లను భవిష్యత్తులో ఉంచుతారనే నమ్మకం లేదన్నారు. ఏపీ ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటున్నారు.. అలా చేస్తే బీజేపీకి 50 సీట్లు ఎక్కువే వస్తాయన్నాని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు