సీఎం సాహసానికి ప్రతీక..‘మిషన్‌’భగీరథ

21 Apr, 2018 14:21 IST|Sakshi
మిషన్‌ భగీర«థ పనులు పరిశీలిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ సురేంద్రమోహన్‌

మంత్రి  జగదీశ్‌రెడ్డి

ఇమాంపేట వద్ద మిషన్‌ భగీరథ పనుల పరిశీలన        

మే5 వరకు ట్రయన్‌ రన్‌

పనులు వేగవంతం  చేయాలని ఆదేశాలు జారీ

సూర్యాపేటరూరల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసానికి మిషన్‌ భగీరథ ప్రతీక అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖా మాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి  పేర్కొన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామం వద్ద జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను కలెక్టర్‌ కే.సురేంద్రమోహన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5 నాటికి ట్రయల్‌రన్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులు , కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంచినీటి కోసం తెలంగాణ ఆడపడుచులు రోడ్డు ఎక్కొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. పథకంగడువు 2018 చివరి వరకు ఉన్నప్పటికీ అనుకున్న దానికి ముందే పనులు శర వేగంగా పూర్తవుతున్నాయన్నారు.

ఒక పక్క అధికారులు , మరో పక్కన ప్రజాప్రతినిధులు రేయింబవళ్లు ఏజెన్సీల వెంట పడడంతో పాటు వేసవిలో ప్రజలకు దా హార్తి సమస్య తలెత్తకుండా ఉండేందు కు పడ్డ శ్రమకు తగ్గ ఫలితాలు త్వరలోనే అందబోతున్నాయని తెలిపారు. అందులో భాగంగానే మే 5న సూర్యాపేటకు నాగా ర్జున్‌సాగర్‌ టెయిల్‌పాండ్‌ నుంచి అందించనున్న మంచినీటిని సూర్యాపేట సమీ పంలోని ఇమాంపేట నీటిశద్ధి కేం ద్రం వద్ద ట్రయల్‌రన్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా పైప్‌లైన్‌ వద్ద ఎన్ని గ్యాప్‌లు ఉన్నాయో పరిశీలించి ప్రతి గ్యాప్‌ వద్ద కచ్చితంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేసే పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ఆదేశిం చారు. అనంతరం ఉర్లుగొండ గుట్టపై నిర్మిస్తున్న వాటర్‌ డిస్ట్రిబ్యూటర్‌ ట్యాంక్‌ను పరిశీలించారు. పర్యటనలో మిషన్‌ భగీరథ సూపరింటెండెంట్‌ మధుబాబు, ఈఈ వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనువాస్‌ గౌడ్, డీఈ నరేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు