రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయి

9 Apr, 2019 16:37 IST|Sakshi

దేశం వెనుకబాటుతనానికి కాంగ్రెస్, బీజేపీలే కారణం

పేదరికాన్ని నిర్మూలించడమే కేసీఆర్‌ సంకల్పం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎంపీస్థానాల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు 

సూర్యాపేటలో జరిగిన రోడ్‌ షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా దేశ రక్షణరంగాన్ని తాకట్టు పెట్టాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ రోడ్‌ షోకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తాళ్లగడ్డ నుంచి ప్రారంభమైన రోడ్‌ షో పూలసెంటర్‌ పీఎస్సార్‌సెంటర్, రాఘవప్లాజా, శంకర్‌ విలాస్‌ సెంటర్‌మీదుగా నేరుగా కొత్తబస్టాండ్‌ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. కొత్తబస్టాండ్‌ జంక్షన్‌ వద్ద ప్రజలనుద్ధేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగించారు.

దేశం వెనుకబాటుకు ఆ రెండు పార్టీలే ప్రధాన కారణమన్నారు. ఆ పార్టీలు ప్రజల ఎజెండాను  పక్కకు పెట్టాయని విమర్శించారు. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజల ఎజెండాను అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దని ఆయన కొనియాడారు. పేదరికాన్ని పారద్రోలడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి తామే సీనియర్లమని ప్రగల్బాలు పలుకుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలు రాజకీయంగా ఎదిగినట్లే జిల్లాలో ఫ్లోరిన్‌ పెరిగిందని మంత్రి దుయ్యబట్టారు.

ఫ్లోరిన్‌పై సీఎం కేసీఆర్‌ దాడి చేసి మిషన్‌ భగీరథ పేరుతో ఇంటింటి మంచినీరు అందించే పథకాన్ని ప్రవేశపెడితే.. కాంగ్రెస్‌ పెద్దలు ఆ పథకాన్ని అడ్డుకోచూపారని గుర్తుచేశారు. మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి 17కు 17ఎంపీ స్థానాలు గెలిపిస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి తెలంగాణ చేరుతుందని పేర్కొన్నారు.

ఉత్తమ్‌పై విసుర్లు..

టీపీసీసీ ప్రెసిడెంట్‌గా అధికార పార్టీ ఎజెండాపై చర్చించాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటీ చేస్తున్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై దాడికే పరిమితమయ్యారని విమర్శించారు. ఓటమి భయంతో నే ఉత్తమ్‌కుమారుడి పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవయ్యారని అందుకే కిందటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారికి డిపాజిట్లు గల్లంతయిన వారికి టికెట్లు ఇచ్చారని తెలిపారు. నల్లగొండలో చెల్లని రూపాయిని భువనగిరిలో.. కొడంగల్‌లో చెల్లని రూపాయిని మల్కాజిగిరిలో.. కల్వకుర్తిలో చెల్లని రూపాయిని మహబూబ్‌నగర్‌లో పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకం : అదే చివరి అస్త్రం..

‘ఏదో ఓ రోజు అందరం చావాల్సిందే’

బీసీ కమిషన్‌ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

చంద్రబాబును ప్రజలు క్షమించరు!

బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు

ఒక పేపర్‌ క్లిప్పింగ్‌తో ఇంత రాద్ధాంతమా?: బుగ్గన

రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలం : మంత్రి బొత్స

డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

సుప్రీం కోర్టులో రెబెల్స్‌కు నిరాశ

కర్నాటకం: అదే ఉత్కంఠ..

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

అధ్యక్షా.. సౌండ్‌ ప్రూఫ్‌ గోడ కట్టండి!

అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!

టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలి

‘ఖబడ్దార్ చంద్రబాబు.. మీ ఆటలు ఇక సాగవు’

ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు

అమిత్‌ షాతో మాజీ ఎంపీ వివేక్‌ భేటీ

అసెంబ్లీలో ‘గే’ వీడియో; ఎమ్మెల్యే కన్నీళ్లు

ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

అబద్ధాలు ఆడటం రాదు: సీఎం జగన్‌

ఒక్కరోజు ఆగితే తిరుగులేదు

నేడే బల నిరూపణ!

ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

బాబు అవినీతితో ప్రపంచబ్యాంకు బెంబేలు

చంద్రబాబు బీసీల ద్రోహి

బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్‌? 

‘పురం’.. ఇక మా పరం! 

కర్ణాటకం : రాజీనామాకు సిద్ధమైన సీఎం

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!