-

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

28 Jul, 2019 13:43 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని సీఎం కేసీఆర్‌  ఆదేశించారు.  అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నెక్లెస్‌ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్‌ పక్కన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజకీయంగా ఎన్నో పదవులు నిర్వహించి.. దేశానికిని, రాష్ట్రానికి వన్నె తెచ్చిన, తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు