'బినామి ఆస్తులు కాపాడాలనేది బాబు తాపత్రయం'

12 Feb, 2020 15:32 IST|Sakshi

సాక్షి, అనంతపురం : అధికార వికేంద్రీకరణ సదస్సు ఎస్కే యునివర్సిటీలోని భువనవిజయం ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ సెమినార్‌కు విద్యార్థి,విద్యార్థినులు భారీగా హాజరై అధికార వికేంద్రీకరణకు జైకొట్టారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ కార్పొరేషన్‌ చైర్మన్‌,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... రాష్ట్ర విభజన వల్ల ఏపీ చాలా నష్టపోయిందని పేర్కొన్నారు. బినామి ఆస్తులు కాపాడుకునేందుకు చంద్రబాబు తాపత్రయమని దుయ్యబట్టారు. అమరావతిలో మాత్రమే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి,  అభివృద్ధి ఒకే చోట జరగాలంటే ఎలా అని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న దృష్యా ఏపీకి మూడు రాజధారుల అవసరం ఎంతో ఉందని, అధికార వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మ ఒడి,రైతు భరోసా పథకాలు చారిత్రాత్మకం అని తెలిపారు.(చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి..)

ఏపీలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షకోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అవసరమా అని, అభివృద్ధి ఒకచోట జరిగితే మిగిలిన ప్రాంతాలు ఏంకావాలని ఆయన ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రకాశ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, ఏపీ పాఠశాల విద్య కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి శ్రీనివాస్, విద్యార్థి సంఘాల నేతలు లింగారెడ్డి, రాధాకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు