‘జమిలి’ ఆలోచనకు 20 ఏళ్లు

22 Jun, 2019 06:08 IST|Sakshi

రాజ్యాంగ చిక్కులు అధిగమించేనా?

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి మోదీ గత వారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 40 పార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మెజారీటీ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసినా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ ఆ సమావేశం నిర్ణయించింది. నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితమే బీజేపీ–ఆరెస్సెస్‌లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన చేశాయి. అటల్‌ బిహారీ వాజపేయి హయాంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అప్పటి లా కమిషన్‌ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది.

70వ దశకం వరకు ....
మన దేశంలో 1951 నుంచి 1967 వరకు లోక్‌సభ, శాసన సభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. రాష్ట్రాల పునర్విభజన జరగడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది.1970వ దశకం నుంచి జమిలి ఎన్నికలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అయితే, 1990లలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది. అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ,టీఆర్‌ఎస్‌ జమిలి ఎన్నికలను సమర్థిస్తోంటే, సీపీఐ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నాయి. 2017 నుంచి మోదీ జమిలి ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాలని ఈ ఏడాది జనవరిలో మోదీ సూచించారు.

ఇవీ అవరోధాలు
జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ప్రస్తుతం  లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా త్వరలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.  నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు ఉండవని రాజ్యాంగ               నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనయినా ఎంపీ లేదా ఎమ్మెల్యే        పదవి ఖాళీ అయినా, ప్రభుత్వం కూలిపోయినా గడువు వరకు వాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉండదంటున్నారు. ఈ విధానంతో ఖర్చు తగ్గుతుందని, రాజకీయ కక్షలు తగ్గుతాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటున్నారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

విశాఖలో టీడీపీ పంచాయితీ

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

కథ బెంగళూరు చుట్టూనే..

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

18న బలపరీక్ష

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’