వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్‌ నాదే

4 May, 2018 10:27 IST|Sakshi
మంత్రి ఆదినారాయణ రెడ్డి(పాత చిత్రం)

వైఎస్సార్‌ జిల్లా : జమ్మలమడుగులో రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఆదినారాయణ రెడ్డి శుక్రవారం కౌంటర్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ టిక్కెట్‌ తనదేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సీనియర్‌ నాయకుడినని చెప్పారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఈ నెల 2న తనదైన శైలిలో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించడానికి ఆదినారాయణ రెడ్డి ఎవరని ప్రశ్నించారు

.
‘జమ్మలమడుగులో పోటీ చేసేది తానేనని ఆదినారాయణరెడ్డి ఎలా ప్రకటిస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని హామీ ఇచ్చారు. ఎన్‌టీఆర్‌ హయాం నుంచి టీడీపీలో టికెట్స్‌ ప్రకటించే హక్కు మంత్రులకు, జిల్లా అధ్యక్షులకు లేదు. పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నారు. లేని పోనీ ప్రకటనలు చేసి నియోజకవర్గంలో వర్గపోరు పెంచుతున్నారు’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఇద్దరూ పరస్పరం బహిరంగ వ్యాఖ్యలు చేసుకోవడంతో అదిష్టానానికి కూడా ఎవరికి టికెట్‌ కేటాయించాలో పాలుపోవడం లేదు. గత ఫ్యాక్షన్‌ గొడవలతో ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు.

మరిన్ని వార్తలు