పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురు దెబ్బ

16 Feb, 2020 18:52 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీలకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి క్యూ కడుతున్నారు. జనసేన పార్టీ నేతలు కురమళ్ల రాంబాబు, సురవరపు సురేష్‌, టీడీపీ మహిళా నాయకురాలు వర్ధినీడి సుజాత, నాయకులు సింగంపల్లి బాబురావు, తడాల సత్యనారాయణతో పాటు 500 మంది వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌ ఇప్పటికీ చంద్రబాబు పార్టనరేనని.. ఐటీ దాడులపై పవన్‌కల్యాణ్‌ నోరు  విప్పకపోవడానికి కారణం అదేనని ఆయన విమర్శించారు.

చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్‌ అమరావతి రైతులను కలిశారని దొరబాబు విమర్శించారు. పవన్‌ విధి విధానాలు నచ్చకే జనసేన నుంచి ఆ పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారని తెలిపారు. ఐటీ దాడులపై ఇంత వరుకు చంద్రబాబు నోరు మెదపక పోవడానికి కారణం ఏమిటని..నోరు విప్పితే ఆయన అవినీతి బండారం బయటపడుతుందని భయమా అని అన్నారు. అవినీతి బాగోతంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్‌ చేసిన అవినీతిపై లోతుగా సీబీఐ,ఈడీలతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే పెండెం దొరబాబు కోరారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు