సినిమాల్లోలా నిజ జీవితంలో చేయడం కష్టం

16 Nov, 2019 04:34 IST|Sakshi
డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ప్రారంభించి భోజనం అందజేస్తున్న పవన్‌ కల్యాణ్, పక్కన నిర్వాహకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

మంగళగిరి/సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ:  సినిమాల్లో చేసినవి నిజ జీవితంలో చేయడం చాలా కష్టమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థానిక నాయకుడు చిల్లపల్లి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రెండున్నర గంటల సినిమాలో సమస్యలకు పరిష్కారం చూపొచ్చుగానీ.. నిజ జీవితంలో ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు.  

ప్రభుత్వాన్ని తిట్టడానికి తాను రెగ్యులర్‌ రాజకీయ నాయకుడిని కాదని, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు స్పందించే నాయకుడినన్నారు. 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ఆకలి బాధలు తెలియవని ధ్వజమెత్తారు. సీఎంను జగన్‌రెడ్డి అంటే వైఎస్సార్‌సీపీ వారు బాధపడుతున్నారని.. 151 మంది ఎమ్మెల్యేలు కూర్చుని ఏమని పిలవాలో తీర్మానం చేయాలన్నారు. రాజధాని భూసేకరణను తానే అడ్డుకున్నట్టు పవన్‌ చెప్పారు. 

ఢిల్లీ పర్యటన బీజేపీ నేతలతో భేటీకేనా!
ఇదిలా ఉండగా పవన్‌కల్యాణ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ, అమిత్‌షా వంటి నేతలను కలిసేందుకేనన్న చర్చ సాగుతోంది. పవన్‌ పర్యటనపై తమ పార్టీ నేతలకు ముందస్తు సమాచారం లేదని బీజేపీ నేత ఒకరు చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా