స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించిన సీపీ

16 May, 2019 15:53 IST|Sakshi

సాక్షి, జనగాం: రాష్ట్రంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అనంతరం రాజకీయ నేతలు, పోలీసులు బ్యాలెట్‌ బాక్స్‌ల మీద దృష్టి పెట్టారు. జిల్లాలో బాలెట్‌బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలను భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్స్‌ కోరకు ఏర్పాటు చేసిన భద్రత ఎర్పాట్లను వరంగల్  పోలీస్  కమిషనర్ డా.వి.రవీందర్ గురువారం పరిశీలించారు. జిల్లాలోని 12 మండలాలకు జరిగిన మూడు విడతలు పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి వీ.బీ. ఐటీ ఏకశిల కళాశాలతో పాటు మైనారిటీ  పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచిన బ్యాలేట్‌ బాక్స్‌లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ భద్రత ఏర్పాట్లతో పాటు, బ్యాలెట్‌ బాక్స్‌ భద్రత కోసం స్ట్రాంగ్‌ రూముల పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీ.సీ కెమెరాల పనీతీరుపై పోలీస్‌ కమిషనర్‌ దృష్టి పెట్టడంతో పాటు, స్ట్రాంగ్‌ రూముల వద్ద పోలీస్‌ భద్రత ఏర్పాట్లపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో చేపట్టాల్సిన బారీకేడ్ల నిర్మాణంతో పాటు, మండలాల వారిగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు, పోలింగ్‌ ఎజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఏ రీతిలో చేరుకోవాల్సి వుంటుందనే అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు నిర్వర్తించాల్సిన విధులపై ఆయన సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు