కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్‌!

24 Jul, 2019 16:47 IST|Sakshi

మాజీ సీఎం సిద్దరామయ్య తీరుపై రాహుల్‌ ఆగ్రహం

తొలినుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిద్దూ!

పలు సందర్భాల్లో ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఎవరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు గెలుకుచుకున్న జేడీఎస్‌కు సీఎం పదవి దక్కడంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరవెనుక చక్రం తిప్పారా?. అంటూ కన్నడ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా.. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. అయితే  ఈ విషయంలో  కాంగ్రెస్‌ నేతల తీరుపై రాహుల్‌ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్‌ నాయకులు ఉండి బీజేపీ వ్యూహాలకు చెక్‌ పెట్టలేకపోయారంటూ రాష్ట్ర నేతలపై అసహనంగా ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా సిద్దరామయ్యపై వ్యవహారంపై రాహుల్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పతానానికి కారణం ఆయనే అంటూ మండిపడుతున్నారని తెలిసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు.  సీఎంగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచీ ప్రభుత్వంపై సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు అన్నీ తానై నడిపించిన తనను కాదని, అతి తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌కు, అందులోనూ తనకు గిట్టని కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టడంపై రామయ్య గుర్రుగా ఉన్నారంటూ పెద్దస్థాయిలో చర్చ కూడా జరిగింది. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని, రానున్న ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలెన్నో. మరోవైపు కుమారస్వామితో పాటు, మాజీ ప్రధాని దేవెగౌడ సైతం సిద్దరామయ్య తీరుపై అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దూ కుట్రపన్నుతున్నారని, తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి వీరి మధ్య సరైన అవగహన లేనట్లు బయటపడింది. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఘోర పరాజయం పాలవ్వడం సంకీర్ణంలో విభేదాలు మరింత పెరిగాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఇరు పార్టీలు కేవలం ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. దేవెగౌడ సైతం ఓటమి చవిచూడక తప్పలేదు. ఫలితాల అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. జేడీఎస్‌తో పొత్తు కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఏకంగా మీడియా సమావేశంలోనే విమర్శించారు. దేవెగౌడ, కుమారస్వామి కాంగ్రెస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలూ చేశారు. దీంతో కన్నడ పంచాయతీ కాంగ్రెస్‌ పెద్దల దగ్గరకు వెళ్లడంతో సిద్దరామయ్య అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు.

ఇదిలావుండగా తాజాగా ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం ఆయనే అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన ఎమ్మెల్యేలు అత్యధిక మంది సిద్దరామయ్య వర్గానికి చెందినవారే ఉన్నారు. రెబల్స్‌ వెనుక సిద్దూ హస్తం ఉందంటూ జేడీఎస్‌ మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయినా కూడా కాంగ్రెస్‌ పెద్దలు పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరుపార్టీల మధ్య ఉన్న విభేదాలను ప్రతిపక్ష బీజేపీ ఆసరాగా చేసుకుని రెబల్స్‌ను తమపైపు తిప్పుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఉన్న ప్రభుత్వం ఊడిపోయి.. బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం చేరబోతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

భ్రమరావతిలోనూ స్థానికులకు ఉపాధి కల్పించలేదు

పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌

ట్రంప్‌తో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు!

ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు

సీఎం జగన్‌పై ప్రముఖ తమిళ పార్టీ ప్రశంసల జల్లు

సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం

‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’

‘తాళపత్రాలు విడుదల చేసినా.. మిమ్మల్ని నమ్మరు’

‘ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొననివారు అనర్హులే’

‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’

అక్టోబర్‌ నుంచే రైతులకు పెట్టుబడి సాయం

కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం

ప్రతిరోజూ రాద్ధాంతమేనా!!

బోయపాటికి షూటింగ్‌ చేయమని చెప్పింది ఎవరు?

‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’

అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ సభ్యులు అత్యుత్సాహం

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

మరో పది రోజులు పార్లమెంట్‌!

అసెంబ్లీలో టీడీపీ తీరు దారుణం 

అసెంబ్లీని ఏకపక్షంగా నడుపుతున్నారు

బడుగులకు మేలు చేస్తే సహించరా?

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది: శిల్పా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!