నేను జైలుకెళ్లా.. మీరు వెళ్లారా?: జీవన్‌రెడ్డి

5 Oct, 2018 02:53 IST|Sakshi

జగిత్యాల రూరల్‌: తెలంగాణ ఉద్యమంలో తాను జైలుకెళ్లానని, మీ కుటుంబంలో ఎవరు వెళ్లారో చెప్పాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నేత టి.జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1983 నుంచి 1999 వరకు కేసీఆర్, తానూ ఎమ్మెల్యేలుగా పనిచేశామని, ఆ సమయంలో ఏనాడూ తెలంగాణ ఊసే ఎత్త లేదని విమర్శించారు.  ఉద్యమ సమయంలో కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్, కుమార్తె కవితను అమెరికాలో ఉంచి.. తెలంగాణ రాగానే.. వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.

ఉద్యమంలో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఏమీ మిగలకుండా చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే మన నిధులు, మన నీరు, మన ఉద్యోగాలని చెప్పిన కేసీఆర్‌.. నాలుగేళ్లలో 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని విమర్శించారు. ఇప్పటికీ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టిన కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వాగ్దానాలు అమలు చేయకపోగా విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ తొలగించారని, మైనార్టీలు, క్రిస్టియన్లు, దళిత, గిరిజనుల నిధులను మళ్లించి వారికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు