‘కేసీఆర్‌ రాజు అనుకుంటున్నారు’ 

25 Jun, 2019 02:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌వి రాచరికపు ఆలోచనలని, నియంతృత్వ ఆలోచనల్లో ఆయన ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హితవు పలికారు. సచివాలయం, అసెంబ్లీ భవనాల కూల్చివేతపై సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఆయనకు నెత్తిన కిరీటం ఒక్కటే తక్కువ. ప్రజాస్వామ్య యుగంలో కూడా తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన రాజు కాదు. ప్రజలు ఎన్నుకొన్న సీఎం మాత్రమే’ అని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2016లో సచివాలయం కూల్చివేతపై హైకోర్టుకు వెళ్లానని, ఆ కేసులో భాగంగా తాము సచివాలయాన్ని కూల్చడం లేదని ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని, ఇప్పుడు సచివాల యం కూల్చివేత కచ్చితంగా కోర్టు ధిక్కరణే అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న సెక్రటేరియట్‌లో భవనాలు 30–40 ఏళ్ల లోపువేనని, ఇంకా 60–70 ఏళ్ల పాటు వాటిని వినియోగించుకునే అవకాశముందని అన్నారు. కానీ, ఇప్పుడు ఎవరూ అడగని సచివాలయం కూల్చివేత చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు