మోదీకి కేసీఆరే అత్యంత సన్నిహితుడు!

26 Aug, 2018 13:44 IST|Sakshi
జగిత్యాల ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి(పాత చిత్రం)

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కంటే తెలంగాణ సీఎం కేసీఆరే అత్యంత సన్నిహితుడని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కొత్త జిల్లాలను ఆమోదింప చేసుకోవడానికి జోనల్‌ విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.

బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సచివాలయం ఏర్పాటు మంచి నిర్ణయం కాదన్నారు. కేసీఆర్‌ చేపట్టిన ఏ కార్యక్రమం ప్రగతి సాధించలేదు..నాలుగేళ్లలో సాధించిన ప్రగతి ప్రగతి భవన్‌ మాత్రమేనని అన్నారు. ముస్లిం రిజర్వేషన్‌ అంశం ఎటుపోయిందని ప్రశ్నించారు. ఫలితాలు సాధించనపుడు ఓటు అడిగే అర్హత ఉండదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు 6 నెలల వ్యవధి ఉండగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు