జార్ఖండ్‌ పోలింగ్‌.. వంతెన పేల్చివేత

30 Nov, 2019 11:50 IST|Sakshi

రాంచి:  జార్ఖండ్‌ రాష్ట్రంలో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. సిట్టింగ్‌ మంత్రి, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి నియోజకవర్గాలు  ఈ విడతలో ఉన్నాయి. 37 లక్షల మంది ఓటర్లు మొదటి విడతలో తమ ఓటు హక్కును వినుయోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వినయ్ కుమార్ చౌబే తెలిపారు. అదేవిధంగా అన్ని పార్టీలకు చెందిన 15 మంది మహళ అభ్యర్థులు, 189 పురుష అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు  ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు. ఇటీవల నక్సలైట్లు దాడులు చేసిన నేపథ్యంలో  లతేహర్, మణిక నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండ జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో శాంతియుతంగా పోలింగ్‌ జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.కాగా, నక్సలైట్లు ఈ రోజు గుమ్లా జిల్లాలోని బిష్ణుపూర్‌లో ఓ  వంతెను పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎవరి ఎటువంటి ప్రమాదం జరగలేదని డిప్యూటి కమిషనర్‌ శశి రంజన్‌ పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల పోలింగ్‌కు ఎటువంటి అంతరాయం కలుగదని తెలిపారు. ఓటింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో ప్రజలు భయాదోళనలకు గురికాకుండా  ఓటుహక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. 

మొదటి విడత పోలిగ్‌ సందర్భంగా దేశ ప్రధాని​ నరేంద్రమోదీ.. ‘ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయాలి’ అని ట్విటర్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు

ఉదయం 9 గంటల వరకు పోలింగ్‌ శాతం: 
లోహర్‌దగా: 11.68%
డాల్టన్‌గంజ్: 10.07%
పాంకి: 9.02%
బిష్రాంపూర్: 9.5%
ఛతర్‌పూర్ (ఎస్సీ): 10.08%
హుస్సేనాబాద్: 09.07%
గర్హ్వా: 11%
భవనాథ్పూర్: 10%
చత్రా (ఎస్సీ): 12.26%
లాతేహర్ (ఎస్సీ): 13.25%

జార్ఖండ్‌ ఎన్నికల పోలింగ్‌ నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా ఉదయం 11 గంటల వరకు 27.4 శాతం పోలింగ్‌ నమోదైంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా