జార్ఖండ్‌ మూడో దశలో 62 శాతం పోలింగ్‌

13 Dec, 2019 05:48 IST|Sakshi

రాంచి: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్‌ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 

మరిన్ని వార్తలు