బీజేపీకి దళిత యువ నేత సవాల్‌

1 Jan, 2018 14:52 IST|Sakshi

పుణే :  రాజ్యాంగాన్ని గౌరవించని నేతలకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని దళిత నేత, యువ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీ పేర్కొన్నాడు. అనంత కుమార్‌ హెగ్డే వ్యాఖ్యలను ఊటంకించిన జిగ్నేష్‌.. బీజేపీ పార్టీకి పెను సవాల్‌ విసిరాడు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్ధతిని మారుస్తామని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. దమ్ముంటే ఆ చేయండి. మా శక్తిని ఉపయోగించి దానిని ఎలా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు.   ప్రజల అభిష్టం, వారి రక్షణ  కోసం చట్టాల రూపకల్పన జరగాలి, అంతేకానీ, పార్టీలు, నేతలు తమ ఇష్టానుసారం మారుస్తామంటే కుదరదు అని జిగ్నేష్‌ తెలిపారు.

ఈ ఎన్నికల్లో  బీజేపీ 150 సీట్లు గెలుచుకోనీయకుండా అడ్డుకోగలిగామని.. అన్నివర్గాలు ఏకమయితే 2019 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించొచ్చని జిగ్నేష్‌ సభీకులను ఉద్దేశించి పిలుపునిచ్చాడు.

కాగా, భీమ-కొరేగావ్‌ యుద్ధం స్మారకార్థం నిర్వహించిన ఆదివారం సాయంత్రం పుణేలో నిర్వహించిన ‘ఎల్గార్‌ పరిషత్‌’లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.   ఈ సభలో రోహిత్‌ వేముల తల్లి రాధిక, భీమ్‌ ఆర్మీ ప్రెసిడెంట్‌ వినయ్‌ రతన్‌ సింగ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌(మాజీ ఎంపీ), జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ తదితరులు హజరుకాగా, పలు విద్యాలయాల నుంచి విద్యార్థులు, ప్రముఖ దళిత నేతలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు