నేను నోరు జారాను!

27 Apr, 2019 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బాలీవుడ్‌ షాట్‌గన్ శత్రుఘ్నసిన్హా  నోరుజారారు. ముస్లింలీగ్‌ నేత మహమ్మద్ ఆలీ జిన్నాను కాంగ్రెస్‌ ఫ్యామిలీలో చేర్చారు. మధ్యప్రదేశ్‌లోని చంద్వారాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన శత్రుఘ్నసిన్హా  ... కాంగ్రెస్ పార్టీని ప్రశంసల్లో ముంచెత్తే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ నుంచి సర్దార్ పటేల్ వరకూ, మహమ్మద్ ఆలీ జిన్నా నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకూ దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించారని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడైన జిన్నాను కాంగ్రెస్‌ కుటుంబసభ్యునిగా పేర్కొంటూ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో కామెంట్లు  వెల్లువెత్తుతున్నాయి. ఈ కామెంట్లపై ప్రత్యర్థులు మండిపడుతున్న నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా వివరణ ఇచ్చారు. తాను అనుకోకుండా నోరు జారానని, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌కు బదులు మహమ్మద్‌ జిన్నా పేరును తాను ఉచ్చరించానని ఆయన వివరణ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు