ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టాలు తీర్చడానికే ఆప్కాస్

4 Jul, 2020 05:47 IST|Sakshi

టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, సుధాకర్‌ బాబు

సాక్షి,అమరావతి: పాదయాత్రలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్‌ ప్రారంభించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌)ను సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. శుక్రవారం వారు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడారు.
► గతంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలన్నీ చంద్రబాబు బంధువు భాస్కర్‌ నాయుడు చేతిలో ఉండేవి.రూ.లక్షలకు అమ్ముకున్నారు. 50 మంది చేయాల్సిన పనిని 30 మందితో చేయించి.. మిగిలిన జీతాల్ని కాంట్రాక్టర్లే తీసుకునేవారు.
► అవినీతికి పాల్పడ్డ అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేస్తే తప్పా? ఆయన దోచుకున్న సొమ్ములో చంద్రబాబు, లోకేశ్‌లకు వాటా ఉంది.
► బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్‌ రావును హత్య చేయించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో భాస్కర్‌ రావు హ త్యకు కుట్ర జరిగిందని అనుమానం ఉంది. కొల్లు రవీంద్రను వెంటనే అరెస్టు చేయాలి. 
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతు న్నాయని అన్నారు. దేవినేని ఉమా పనికిమాలిన మాటలు మాట్లాడు తున్నా డని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు.

మరిన్ని వార్తలు