బాబు ఇల్లు మునిగితే.. సంతాప దినాలా! 

20 Aug, 2019 04:27 IST|Sakshi

దేవినేని ఉమ, బుద్దా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలి 

ఎమ్మెల్యే జోగి రమేష్‌ 

సాక్షి, అమరావతి: వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే .. చంద్రబాబు ఇల్లు మునుగుతోందంటూ టీడీపీ నేతలు వారం రోజులపాటు సంతాప దినాలు జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలు అల్లాడుతుంటే వారికి సహాయం చేయాలని ఏ రాజకీయ పార్టీకైనా, వ్యక్తికైనా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన వందిమాగధులైన దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బొండా ఉమ లాంటివారు మాత్రం బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక్కడ ఒక ఇంటిని కూడా నిర్మించుకోలేదన్నారు. ఎవరో నిర్మించిన అక్రమ కట్టడంలో ఉండటం ఏంటని నిలదీశారు. బుద్ధిలేని వెంకన్న ఆత్మహత్య చేసుకుంటానంటున్నారని.. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గు, శరం ఉండాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిపై డ్రోన్‌ ఎగరటం పెద్ద సమస్యలా గగ్గోలు పెడుతున్నారని, డ్రోన్లతో వరద పరిస్థితులను అంచనా వేయటం తప్పెలా అవుతుందని నిలదీశారు. చంద్రబాబును హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు అంటున్నారని.. ఐదుకోట్ల ఆంధ్రులు ఆయనను ఇప్పటికే రాజకీయంగా సమాధి చేశారని అన్నారు. చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం, అగత్యం ఎవరికీ లేదని, ఆయన బందరు రోడ్డులో నడుచుకుంటూ వెళ్లినా పట్టించుకునేవారే ఉండరని అన్నారు.
 
ఓర్వలేకే జగన్‌ పర్యటనపై విమర్శలు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తే ఓర్వలేని వారంతా మాట్లాడుతున్నారని, టీడీపీ వారి లాగా పర్యటనలకు రూ.కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదని రమేష్‌ పేర్కొన్నారు. ఇందుకు సీఎం వైఎస్‌ జగన్‌ తన సొంత డబ్బు వెచ్చిస్తున్నారని స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం అక్కడి వారితో మాట్లాడి పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చౌకబారు మాటలు మాట్లాడుతూ.. విందులు, విలాసాలు చేస్తున్నారనటం సరికాదన్నారు. కొందరు బీజేపీలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా అద్దె గొంతులు వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధిష్టానం ఇలాంటి కోవర్టులను గురించి తెలుసుకుని ప్రవర్తించాలన్నారు. కనీస జ్ఞానం లేకుండా లోకేశ్‌ పడవను అడ్డుపెట్టి వరదను చంద్రబాబు ఇంట్లోకి పంపారని ట్వీట్‌ చేయటం అతడి అపరిపక్వతకు నిదర్శనమన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం

ఎమ్మెల్సీలు.. ఏకగ్రీవం

బీజేపీలోకి త్వరలో టీఆర్‌ఎస్‌ ఎంపీ

ఉలికిపాటెందుకు? 

నడ్డా.. అబద్ధాల అడ్డా 

కవితను అడిగితే తెలుస్తుంది బీజేపీ ఎక్కడుందో!

‘డ్రోన్‌ తిరిగింది బాబు కోసం కాదు..’

మంగళవారం మంత్రివర్గ విస్తరణ

‘వరదలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు’

జేపీ నడ్డా పచ్చి అబద్ధాలకు అడ్డా : కేటీఆర్‌

సమోసాలు తింటూ రాహుల్‌ గాంధీ..

బాబు.. లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పు

బిహార్‌ మాజీ సీఎం కన్నుమూత

‘దేశం’ ఖాళీ

ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి

‘2023లో అధికారంలోకి వచ్చేది మేమే’

టీఆర్‌ఎస్‌కు కడుపు మండుతోంది : నడ్డా

గ్రీన్‌ ఛాలెంజ్‌: స్వీకరించిన మిథున్‌ రెడ్డి

కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ గరికపాటి

మినరల్‌ వాటర్‌ అడిగామన్నది అబద్ధం..

‘ఆ యూనివర్సిటీకి మోదీ పేరు పెట్టండి’

20న మంత్రివర్గ విస్తరణ

టీడీపీకి యామిని గుడ్‌ బై!

20న యెడ్డీ కేబినెట్‌ విస్తరణ

రీ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా

చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు

‘ఆయుష్మాన్‌’ను అడ్డుకోవద్దు

‘పత్తాలేని ఉత్తర కుమారుడు’

‘కేసీఆర్‌ వాటికే పరిమితమయ్యారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త జోడీ

ప్రేమలో పడితే..!

మా సభ్యులకు అవకాశాలివ్వాలి

తొమ్మిది గంటల్లో...

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌