‘సభాముఖంగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

12 Dec, 2019 11:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు ఉన్మాది అనటంపై ఎమ్మెల్యే జోగి రమెష్‌ తీవ్రంగా మండిపడ్డారు. మనసున్న సీఎం జగన్‌ను ఉన్మాది అంటారా.. లేక ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసిన చంద్రబాబును ఉన్మాది అంటారా.. తెసుకోవాలని ఆయన ధ్వజమెత్తారు. అసెంబ్లీ బయట మార్షల్స్‌లో గొడవ పడుతూ.. సీఎం గురించి ఆ భాషలో మాట్లాడవల్సివ అవసరం లేదని రమేష్‌ దుయ్యబట్టారు.

దీంతోపాటు మార్షల్స్‌తో గొడవపడుతూ.. ఫోటోలు తీస్తామం​టూ బెదించారు. ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తారా.. లేకపోతే అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారా అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబునాయుడు ఐదుకోట్ల మందికి నాయుకుడు అయిన ముఖ్యమంత్రిని జగన్‌ను ఉద్దేశించి ఉన్మాది అనే తప్పుడు మాట అన్నందుకు ఈ సభాముఖంగా క్షమాపణ చేప్పాలని రమేష్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాతనే సభను ముందుకు సాగించాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ స్పీకర్‌ను కోరారు.

మరిన్ని వార్తలు