వైఎస్సార్ సీపీలోకి జూ.ఎన్టీఆర్‌ మామయ్య

28 Feb, 2019 12:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగేలా షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు టీడీపీ నేతలు  వరుసపెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. పార్టీపరంగా ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే మరోవైపు బంధువర్గం నుంచి కూడా చంద్రబాబుకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీ రామారావు పెద్దల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్‌ వైఎస్సార్ సీపీలో చేరారు.  (వైఎస్సార్ సీపీలో చేరిన కిల్లి కృపారాణి)

తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నే శ్రీనివాసరావు గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఏపీలో చంద్రబాబు పాలన సరిగా లేదు. వైఎస్‌ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే పార్టీలో చేరాను. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో నాకు పదేళ్ల నుంచి అనుబంధం ఉంది. నేను వైఎస్సార్ సీపీలో చేరడానికి... జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంబంధం లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో, లేదో తెలియదు. అయితే పార్టీ గెలుపుకు నా వంతు కృషి చేస్తాను. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యమ’ని తెలిపారు. 

కాగా చంద్రబాబు నాయుడుకు దగ్గర బంధువు అయిన నార్నే శ్రీనివాసరావు (నార్నే శ్రీనివాసరావు భార్య చంద్రబాబుకు స్వయాన మేనకోడలు) వైఎస్సార్‌ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరిం‍చుకుంది. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌-లక్ష్మీప్రణతి వివాహానికి చంద్రబాబే పెళ్లిపెద్దగా వ్యవహరించారు కూడా. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు... ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని... మహాకూటమి తరఫున కూకట్‌పల్లి నుంచి పోటీ చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసినా... వాళ్లు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికే ఈ పరిణామాలను చంద్రబాబు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు... బంధువర్గం నుంచి గట్టి దెబ్బే తలిగిందని చెప్పుకోవచ్చు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

విశాఖలో టీడీపీ పంచాయితీ

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

కథ బెంగళూరు చుట్టూనే..

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

18న బలపరీక్ష

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’