షరీఫ్‌ కూతురి కామాలు, ఫుల్‌స్టాపులు

27 May, 2018 09:37 IST|Sakshi
నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరయమ్‌ నవాజ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతురు మరయమ్‌ నవాజ్‌పై జడ్జిలు అసహనం వ్యక్తం చేశారు. అవన్‌ఫీల్డ్‌ అవినీతి కేసు వ్యవహారంలో కోర్టు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అయితే ఆమె ప్రకటన చదివి వినిపిస్తున్న సమయంలో కామాలు, ఫుల్‌స్టాపులను కూడా చదువుకుంటూ పోయారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన జడ్జి వాటిని వదిలేసి ఉన్న మ్యాటర్‌ చదవాలంటూ ఆమెను కోరారు. అయినా మరయమ్‌ మాత్రం అలానే చదువుకుంటూ వెళ్లారు. వెటకారం చేస్తున్నారా? అంటూ ఒకానోక దశలో జడ్జి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫుల్‌స్టాపులు, కామాలు చదవకపోతే మొత్తం అర్థాలు మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కూడా చదివి వినిపిస్తున్నా’  అంటూ ఆమె ప్రశాంతంగా బదులిచ్చి కూర్చున్నారు. ఈ కేసులో జడ్జి అడిగిన మొత్తం 128 ప్రశ్నలలో 46కు మాత్రమే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరయమ్‌ కంటే ముందు నవాజ్‌ షరీఫ్‌ను కూడా జడ్జి ప్రశ్నలు అడిగి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

మరిన్ని వార్తలు