రాజ్‌నాథ్‌తో సింధియా భేటీ

12 Mar, 2020 11:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు.  బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి ఢిల్లీలోని మంత్రి నివాసానికి వెళ్లిన సింధియాను రాజ్‌నాథ్‌ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించకున్నారు. మర్యాదపూర్వకంగానే రాజ్‌నాథ్‌తో సింధియా బేటీ అయినట్లు తెలుస్తోంది.
(చదవండి : కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా)

కాగా, అనేక రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌ను వీడియా సింధియా.. బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో ఆయన ఆ పార్టీలో చేరారు. వెంటనే ఆయనను మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దాంతో, ఆయన మరోమారు కేంద్ర మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు సింధియాతో పాటు మరో 22మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమలనాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. రాజీనామాలు చేయగా మిగిలిన తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ జైపూర్‌కు తరలించింది. బీజేపీ ముందుజాగ్రత్త చర్యగా తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్‌లోని ఒక హోటల్‌లో ఉంచింది. తమ రాజీనామాలను ఒక బీజేపీ సీనియర్‌ నేత ద్వారా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌కు పంపించిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు శిబిరంలో కొనసాగుతున్నారు.
(సింధియా నిష్క్రమణతో ‘చేతి’కి చిక్కులు)

మరిన్ని వార్తలు