‘టీడీపీతో పొత్తు వల్ల నష్టపోయేది మేమే’

16 Feb, 2019 15:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీతో ఎన్నిసార్లు పొత్తుపెట్టుకున్నా నష్టపోయిది తమ పార్టీయేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ కేవలం 10 సీట్లు గెలిస్తే చాలనుకుంటున్నాడు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. 55 సంవత్సరాల కాంగ్రెస్‌ పాలన వర్సెస్‌ 55 నెలల్లో మోదీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ప్రధాన ఎజండాగా లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.

మోదీ ప్రధాని కావాలని కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు కోరుకుంటున్న మాదిరాగానే రేణక చౌదరి కూడా కోరుకుంటున్నారేమోనని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ స్థానిక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవు దినాల్లో ఓటింగ్‌ పెట్టవద్దని.. పోలింగ్‌ సమయాన్ని గంట పెంచాలని ఈసీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. మార్చి 2 తర్వాత అభ్యర్థు పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అమిత్‌ షా ఆదేశిస్తే పార్లమెంట్‌కు పోటీచేస్తానని తెలిపారు.

ఈ నెల 25న నల్గొండ క్లస్టర్‌, 26న వరంగల్‌ క్లస్టర్‌లో మీటింగులు.. అదే రోజున మోదీ పథక లబ్ధిదారులతో ‘కమల్‌ జ్యోతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. కరీంనగర్‌ ఎమ్‌ఎల్‌సీ వివాదంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు, బీజేపీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు