ప్రకృతి వైద్యానికి తండ్రీ తనయులు

30 Apr, 2019 09:55 IST|Sakshi

సాక్షి బెంగళూరు : కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ ప్రకృతి చికిత్స కోసం ఉడుపి జిల్లాకు ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడి కాపువిన మూళూరులో ఉండే ఓ రిసార్టులో వారు ప్రకృతి వైద్యం చేయించుకుంటారు. ఈ క్రమంలో కుమారస్వామి అక్కడే ఐదు రోజులు ఉండే అవకాశం ఉంది. దేవెగౌడ తిరిగిరాకపై సమాచారం లేదు. లోక్‌సభ ఎన్నికల తరువాత కుమారస్వామి ఆయుర్వేద వైద్యం కోసం ఓ రిసార్టులో చేరారు. అయితే కొలంబోలో బాంబుపేలుళ్లలో కొందరు జేడీఎస్‌ నేతలు దుర్మరణం చెందడంతో, ఆయన అర్ధాంతరంగా తిరిగి వచ్చారు. ఫలితంగా దేవెగౌడతో కలిసి వెళ్లినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భీకర కరువు రాజ్యం ఏలుతుంటే సీఎం కుమారస్వామి విశ్రాంతి తీసుకోవడం ఏమిటని బీజేపీ నాయకుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పాలన జరగలేదని ఆరోపించారు. ఇలాంటి సమయంలో పాలన పక్కన పెట్టి రిసార్టులో విశ్రాంతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు