పథకాలు అడిగితే బినామీలంటారా..

13 Jan, 2018 09:35 IST|Sakshi

మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కళావతి మండిపాటు

పాలకొండ రూరల్‌: జన్మభూమి గ్రామసభల్లో పథకాలు వర్తింపజేయాలని గట్టిగా అడిగిన వారిని బినామీలుగా మంత్రి కళావెంకటరావు వ్యాఖ్యానించడం తగదని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత నాలుగు జన్మభూమి సభల్లోనూ అర్జీలు చేసుకున్న వారే తాజా గ్రామసభలోనూ దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి న్యాయం జరగడం లేదన్నారు. పక్షపాత ధోరణితో జన్మభూమి కమిటీలు అర్హులకుఅన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.

వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్ల కోసం దరఖాస్తులు అందిస్తే  వారికి కొత్త పేర్లు పెట్టి అవమానించటం శోచనీయమన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు ఉంటే వారు అర్హులనే విషయాన్ని మంత్రి గుర్తించాలన్నారు. పచ్చ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు కట్టపెట్టిన అధికార పార్టీని ప్రజలు అన్నిచోట్టా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదన్నారు.

మరిన్ని వార్తలు