డీఎంకే–కాంగ్రెస్‌ విడిపోతాయి: కమల్‌ హాసన్‌

18 Jan, 2020 09:17 IST|Sakshi

మక్కళ్‌నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ 

పెరంబూరు:  డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి బీటలువారుతోందని మక్కళ్‌నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌ అన్నారు.  ఈ కూటమిలోని కోల్డ్‌వార్‌ను తనకు అనుకూలంగా మార్చుకునే కమల్‌ ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈక్రమంలో ఆయన చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి త్వరలోనే విడిపోతుందని తాను ఎప్పుడో చెప్పానన్నారు. ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల్లో రెండు పారీ్టల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. డీఎంకే పొత్తు ధర్మం పాటించలేదని కాంగ్రెస్‌ నేతలు కేఎస్‌ అళగిరి, కేఆర్‌ రామస్వామి ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో డీఎంకే అధినేత స్టాలిన్‌పై విమర్శలుండడంతో ఆ పార్టీ నేత దురైమురుగన్‌ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు మరో ప్రకటన విడుదల చేశారు. డీఎంకేపై తమకు అపారమైన గౌరవ ముందని, కూటమి నుంచి విడిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడం విశేషం. 

రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్‌ పారీ్టల మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పారీ్టలు గత సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఈ కూటమి పోటీ చేసింది. అయితే అక్కడే ఈ రెండు పారీ్టల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ ఎన్నికలు ముగిసిన తరువాత  డీఎంకే పొత్తు ధర్మాన్ని పాఠించలేదని తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కేఎస్‌.అళగిరి,తమిళనాడు కాంగ్రెస్‌ శాసనసభా నేత కేఆర్‌.రామస్వామి ఇక ప్రకటన విడుదల చేసి అందులో డీఎంకే పై విమర్శలు గుప్పించారు. దీంతో  డీఎంకే– కాంగ్రెస్‌ పారీ్టల మధ్య పొగ పెడుతున్నట్టు  స్టాలిన్‌పై ఆరోపణలు చేసినట్లు డీఎంకే మాజీ నేత దురైమురుగన్‌ కాంగ్రేస్‌ నేతలపై ఫైర్‌ అయ్యారు ఓటు బ్యాంకు లేని పార్టీ కాంగ్రేస్‌ అని దుయ్యబట్టారు.కాగా .ఈ వ్యవహారం  ఇరు పార్టీ చిచ్కు పెట్టడంతో రాష్ట్ర కాంగ్రేస్‌ పార్టీ నేతలు  దిద్దుబాటు చర్యలకు దిగారు. కేఎస్,అళగిరి,కేఆర్‌.రామసామి మరో ప్రకటనను విడుదల చేస్తూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పారీ్టకి సరైన స్థానాలు లభించలేదన్న కార్యకర్తల ఆవేదననే తాము వ్యక్తం చేశామని, డీఎంకే నేతృత్వంపై తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. డీఎంకే– కాంగ్రేస్‌ పారీ్టలది లక్ష్య కూటమి అని అన్నారు. కాబట్టి విభేదాలకు తావేలేదని అన్నారు. 

>
మరిన్ని వార్తలు