‘గో బ్యాక్‌ మోదీ’ అంటే ఎలా..?

12 Oct, 2019 08:34 IST|Sakshi

చెన్నై, పెరంబూరు:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నటుడు, మక్కళ్‌నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ మద్దతుగా మాట్లాడారు. గురువారం ప్రపంచ బ్యాడ్మింటిన్‌ చాంపియన్‌ సింధు మక్కళ్‌ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమలహాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ కమలహాసన్‌ నటుడిగా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు.అలాంటి నటుడిని కలవడం, ఆయనతో కలిసి విందారగించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. అనంతరం నటుడు కమలహాసన్‌ మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి విజయాన్ని అందించిన క్రీడాకారిణిని ఆహ్వానించడాన్ని గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.

కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌  భారతదేశానికి రావడంపై స్పందిస్తూ, 60 ఏల్ల తరువాత ఒక చైనా అధ్యక్షుడు మామల్లపురం రావడం చారిత్రక గొప్ప సంఘటనగా పేర్కొన్నారు. రెండు దేశాల శ్రేయస్సు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలుపుతున్నానాన్నారు. మన ప్రధానమంత్రి చైనా అధ్యక్షుడి వద్ద విన్నవించే కోరికలు సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మనమే ఓట్లు వేసి కమ్‌ అని చెప్పి ఇప్పుడు గో బ్యాక్‌ మోదీ అంటే ఎలా అని కమలహాసన్‌ అన్నారు. మన విమర్శలను ఎప్పటిలానే వ్యక్తం చేద్దాం అని, అందుకు చట్టపరంగా చర్యలు తీసుకున్నా, మనం నిజాయితీగా వ్యవహరిద్దాం అని కమలహాసన్‌ పేర్కొన్నారు.

థియేటర్ల మూసివేత
కాగా చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని శుక్ర, శనివారాలు చెన్నైలో ఉండడంతో ఈ రెండు రోజుల్లో సినిమా థియేటర్లను, వర్తక దుకాణాలను మూయించారు. ముఖ్యంగా చెన్నై రాజీవ్‌గాందీ రోడ్డులోని వాణిజ్య దుకాణాలను మూయించారు.అదే విధంగా పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు. (చదవండి: పల్లవించిన స్నేహగీతం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా