కంచర్ల వర్సెస్‌ రాజగోపాల్‌ 

20 Feb, 2020 02:52 IST|Sakshi
సమ్మేళనంలో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి

వాగ్వాదం.. గందరగోళం  

సాక్షి ప్రతినిధి, నల్లగొండ:  నల్లగొండలో బుధవారం జరిగిన పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మధ్య వా గ్వాదం చోటు చేసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమ్మేళనంలో మొదట రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో అనుకున్న విధంగా అభివృద్ధి జరగడం లేదని, ప ల్లె ప్రగతికి సరిపడా నిధులు రావడం లేదని విమర్శించారు. తర్వాత భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రైతుబంధు, రైతు బీమాలాంటి సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల కళ్లకు కనిపించడం లేదా..? ఇంతకు ముందున్న మంత్రి ఏం చేశాడు’.. అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు లేచి భూ పాల్‌ అన్న జై అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. వ్యక్తిగతంగా మా ట్లాడుతున్నావంటూ భూపాల్‌రెడ్డి ప్రసంగాన్ని అ డ్డుకోబోయారు. దీనికి భూపాల్‌రెడ్డి ‘నువ్వు మా ట్లాడినంతసేపు నేను అడ్డుకోలేదు.. నేను మాట్లాడుతున్నాను నువ్వు మాట్లాడవద్దు’అని అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. భూపాల్‌రెడ్డి.. రాజ్‌గోపాల్‌రెడ్డి కూర్చున్న వైపు దూసుకురావడంతో వేదికమీద ఉన్న నాయకులు, పోలీసులు ఇద్దరినీ సముదాయించారు.

సమ్మేళనం రాజకీయాల కోసం కాదు..  
ఆ తర్వాత విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, ఇది రాజకీయాల కోసం పెట్టుకున్న సమ్మేళనం కాదని, ప్రజల నమ్మకానికి అనుగుణం గా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలంటూ అంతకుముందు జరిగిన వాగ్వాదంపై వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆకలి, దరిద్రాన్ని పా రదోలిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. 

మరిన్ని వార్తలు