-

ఆరంభించాం.. చాలా టైమ్‌ పడుతుంది

3 Apr, 2019 17:02 IST|Sakshi
కన్హయ్య కుమార్‌ (ఫైల్‌)

సాక్షి, న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టంలో మార్పులకు చాలా కాలం పట్టొచ్చని మాజీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ అభిప్రాయపడ్డారు. క్రూరమైన బ్రిటీష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టంలో సవరణలు చేపడతామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో ప్రకటించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో కన్హయ్య మాట్లాడుతూ.. ‘ఈ చట్టం తొలగింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశాలున్నాయి. చట్టంలో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉండటం మన రాజ్యాంగంలో ఉన్న అతిగొప్ప విషయం.  దేశద్రోహ చట్టం బీజేపీ హయాంలోని అస్సాంలో ఎలా దుర్వినియోగమైందో చూశాం. పౌరసత్వ బిల్లుపై ప్రశ్నించినందుకు, అక్కడి రైతు సంఘం నాయకుడు అఖిల్‌ గొగోయ్‌ను, ఈ చట్టం కింద బీజేపీ ప్రభుత్వం అరెస్ట్‌ చేసింద’ని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కన్హయ్య కుమార్‌ బీహార్‌లోని బెగుసరాయ్‌ నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 

మరిన్ని వార్తలు