ప్రపంచానికి మోదీ ఆదర్శం

1 Jun, 2020 05:37 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 

సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ తన పాలనా సామర్థ్యంతో ప్రపంచానికే ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంలో మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి కన్నా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏడాది కాలంలో మోదీ పారదర్శకమైన పాలనతో వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేశారని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్‌ను నియంత్రిస్తుండటమే కాకుండా.. దేశం స్వయం సమృద్ధితో ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్న గొప్పనాయకుడిగా ప్రజల నుంచి మన్ననలు పొందారని అన్నారు. 

రమేష్‌ కుమార్‌ను కొనసాగించండి 
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని కన్నా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ఈ విషయాన్ని మరింత సాగదీస్తే రాష్ట్రానికున్న మంచి పేరు పోవడమే కాకుండా, న్యాయవ్యవస్థ పట్ల రాష్ట్రానికున్న గౌరవాన్ని కూడా తగ్గించినట్టవుతుందని పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా