చంద్రబాబు గజదొంగ 

21 Oct, 2018 12:05 IST|Sakshi
మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 

అనంతపురం అర్బన్‌ : జన్మభూమి కమిటీ సభ్యుల మొదలు సీఎం చంద్రబాబు వరకూ అందరూ దోపిడీ దొంగలేనని, ఇసుక, మైనింగ్‌ మాఫీయా, భూకబ్జాదారులు, ఐటీ ఎగవేతదారులను కాపాడుతున్న చంద్రబాబు గజదొంగ కాకమరేమిటం టూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ‘రాయలసీమ ప్రజావేదన ధర్నా’లో ఆయన ప్రసంగించారు. రాయలసీమకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్నా అన్యాయంపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రజావేదన ధర్నా చేపట్టినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతోనే రాయలసీమ సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపించారు.  

రాయలసీమలోని రిజర్వాయర్లకు నికర జలాలు, సీమ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారంటూ దుమ్మెత్తిపోశారు. రాష్ట్రం లో ప్రాజెక్ట్‌లను తన ధనాగారంగా మార్చుకుని దోచుకో.. దాచుకో అన్న సిద్ధాంతంతో పాలన సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.  హంద్రీ–నీవా,గాలేరి–నగరి ప్రాజెక్టులు 2014 నాటికి 85 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన కొద్దిపాటి పనులకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి తన పార్టీ ఎంపీలు, నాయకుల కు నిధులను సీఎం చంద్రబాబు దోచిపెట్టారన్నా రు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను దగా చేశారన్నారు. తన కుమారునికి మంత్రి పదవి కట్టబెట్టడం తప్ప నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తూర్పారబట్టారు.  

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కేంద్రం అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఉక్కుపరిశ్రమ రాకుండా అడ్డుపడుతోంది కూడా చంద్రబాబేనని ఆరోపించారు. తన హెరిజేజ్‌ సంస్థ కోసం ఏపీ డెయిరీలను నిర్వీర్యం చేశాడన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెపార్టీ మోసం చేసిందంటూ గత ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో కలిసి పనిచేయడం ఆయన నైజం ఏమిటనేది స్పష్టమవుతోందన్నారు. రాయలసీమలో మూత పడిన పరిశ్రమలను వెంటనే పునః ప్రారంభిం చాలని డిమాండ్‌ చేశారు.  

ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆంకాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి, రాష్ట్ర సంఘటనా ప్రధా న కార్యదర్శి రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెలే పార్థసారథి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నీలకంఠ, భానుప్రకాష్‌రెడ్డి, యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌నాయుడు, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సూర్యానారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరెడ్డి, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు శ్రీనాథ్‌రెడ్డి, హరీష్‌బాబు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు