చంద్రబాబుకు మతి స్థిమితం బాగోలేదు : కన్నా

8 Jul, 2018 14:26 IST|Sakshi
కన్నా లక్ష్మినారాయణ (ఫైల్‌ ఫోటో)

ఉక్కు పరిశ్రమకు కేంద్రం కట్టుబడి ఉంది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ

సాక్షి, అమరావతి : ప్రజల్లో టీడీపీపై వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక చంద్రబాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. కడపలో ఆదివారం ఓ సమావేశంలో కన్నా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్‌ను మోదీ తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చినా మోదీపై బురద జల్లడం ఏంటని మండపడ్డారు. ఏపీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని ‍స్పష్టం చేశారు. కడప ఉక్కు పరిశ్రమకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేసిన సీఎం రమేష్‌ మెకాన్‌ అడిగిన నివేదికను ఇప్పించాలని కోరారు.

ఇతర రాష్ట్రాలు రాజకీయ విమర్శలు చేస్తుంటే ఏపీ ‍మాత్రం కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించడం తగదని అన్నారు. తెలంగాణ, ఏపీలో ఉక్కు పరిశ్రమను నిర్మించి తీరుతామని తెలిపారు. స్ర్కాప్‌ విషయంలో చైనాతో ఒప్పందం చేసుకునందుకే కడప ఉక్కు ఫ్యా‍క్టరీను చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చం‍ద్రబాబుకి భూ దాహం, ధన దాహం పట్టుకుందని, అందుకే డాట్‌ భూములను తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు మతిస్థితి బాగోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఎటు వెళ్తుందో కూడ బాబుకు అర్దం కావట్టేదని వ్యాఖ్యానించారు. బాధ్యత కలిగిన రాజ్యసభ సభ్యులు ఆలోచించకుండా దీక్ష ఎలా చేశారని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు