ఎంపీగా పోటీ చేయనున్న కన్నయ్య కుమార్‌

2 Sep, 2018 18:19 IST|Sakshi
కన్నయ్య కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

వచ్చే ఎన్నికల్లో బిహార్‌ నుంచి లోక్‌సభకు పోటీ

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ ఎంపీగా పోటీ చేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు బిహార్‌ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్‌ ప్రకటించారు. సీపీఐ నుంచి ఆయన పోటీ చేస్తారని, దీనికి వామపక్ష పార్టీల మద్దతు తెలిపినట్లు ఆదివారం ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన మిత్రపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు కూడా కన్నయ్య కుమార్‌కు మద్దతు తెలిపాయని వెల్లడించారు.

ఆర్జేడీ ఛీప్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ గతంలోనే ఆయన పేరును ప్రతిపాధించారని, ఆయన సూచన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా కన్నయ్య కుమార్‌  పోటీ చేయనున్నట్లు తెలిపారు. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఢిల్లీ పోలీసులు గతంలో దేశ ద్రోహ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కన్నయ్య కుమార్‌ ఇదే నియోజవర్గానికి చెందిన భీహాట్‌ గ్రామ పంచాయతీ చెందినవాడు. కాగా 2014 ఎన్నికల్లో బెగుసరై నియోజవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్‌ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి భోలా సింగ్‌ 58 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

మరిన్ని వార్తలు