ఉత్తరాంధ్ర ద్రోహులు చంద్రబాబు, రామోజీ

21 Jul, 2020 04:00 IST|Sakshi

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజం

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు సెక్రటేరియట్‌ వస్తుందంటే చంద్రబాబుతో పాటు రామోజీరావుకి కూడా నిద్ర పట్టడంలేదని, వీరిద్దరు చరిత్రలో ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. సోమవారం ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను చూస్తే వారిద్దరి అక్కసు ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఈ వార్తను టీడీపీ నేతలు మరో రెండు ఆంగ్లపత్రికల్లో కూడా తమ పలుకుబడి ఉపయోగించి ప్రచురింపజేశారని తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ముఖ్యాంశాలు..

► ఎప్పుడో 1 కోటీ 60 లక్షల ఏళ్ల క్రితం తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో చీలిక ఏర్పడిందని, 68 లక్షల ఏళ్లకు పూర్వం నుంచి 30 లక్షల ఏళ్ల పూర్వం వరకు ఆ చీలికలో అలజడి ఉండేదని ఈనాడులో రాశారు.
► ఆ చీలిక వల్ల భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో ఎప్పుడైనా భూకంపాలు రావచ్చునని ఎవరో ఓ ప్రొఫెసర్‌ను పట్టుకుని ఉద్దేశపూర్వకంగా చెప్పించారు. 
► 30 లక్షల ఏళ్ల క్రితమే ఆగిన అలజడి, ఇప్పుడు చంద్రబాబు దిగిపోవటంతో మళ్లీ రామోజీలో రేగినట్లుంది. విశాఖ ఇమేజిని, ఉత్తరాంధ్ర ప్రాభవాన్ని దెబ్బతీయటానికి చంద్రబాబుతో కలిసి రామోజీ ఇంతలా దిగజారిపోతారా? 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా