‘రాజకీయ లబ్ధి కోసమే ప్రజా చైతన్య యాత్ర’

27 Feb, 2020 15:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చోడవరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన గురువారం మీడియాతో  మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబుకు ఎందుకు అంత కడుపుమంట అని మండిపడ్డారు. చద్రబాబు విశాఖకు కేవలం పెళ్లి పనులకోసమే వచ్చారని ఎద్దేవా చేశారు. వికేంద్రీకరణ అంశాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు చంద్రబాబు పథకం పన్నుతున్నారని ఆయన అన్నారు. ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారని ధర్మశ్రీ సూటిగా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర  అభివృద్ధి జరిగితే.. ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర  అభివృద్ధి గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదని ధర్మశ్రీ ధ్వజమెత్తారు. (చంద్రబాబుది మామూలు ‘గుండె’ కాదు)

సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రజా చైతన్య యాత్ర కేవలం రాజకీయ లబ్ది కోసమే అని​ మండిపడ్డారు. కేవలం వివాదం చేయడానికే విశాఖకు చంద్రబాబు వచ్చారని ఆయన అన్నారు.  ఉత్తరాంధ్రకు ఏం మేలు చేశారో చంద్రబాబు చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవమంతా తన స్వలాభం కోసమే వినియోగించారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిన  చంద్రబాబకు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. చంద్రబాబును వెనక్కి పంపించాల్సిందే అని అప్పల రాజు అన్నారు.(‘చంద్రబాబును అడుగుపెట్టనివ్వం’)

పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతు.. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆమె అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎందకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని  భాగ్యలక్ష్మి  డిమాండ్‌ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని  మనస్ఫూర్తిగా స్వాగితిస్తున్నామని  భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. (పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..)

మరిన్ని వార్తలు