‘బీజేపీ 70 సీట్లకే పరిమితం’

12 May, 2018 11:01 IST|Sakshi
సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 60 నుంచి 70 సీట్లే వస్తాయని, కాంగ్రెస్‌ అత్యధిక సీట్లలో గెలుపొంది తిరిగి అధికారం చేపడుతుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీకి 150 సీట్లు వస్తాయని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారు.ఆ పార్టీకి 60 నుంచి 70 స్థానాలు మించి దక్కవ’ని ఖర్గే అన్నారు.

మరోవైపు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మాట్లాడుతూ.. సిద్ధరామయ్య సర్కార్‌పై ప్రజలు విసిగివేసారారని ఆ పార్టీకి ఓటమి తప్పదని, బీజేపీకే ప్రజలు పట్టంకడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేసిన కన్నడ బ్యాలెట్‌ పోరు ఎవరికి విజయాన్ని వరింపచేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మే 15న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

మరిన్ని వార్తలు