కన్నడ బీజేపీ వివాదాస్పద ట్వీట్‌

10 Feb, 2020 08:48 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ శాఖ పోస్టు చేసినట్లుగా ప్రచారంలో ఉన్న ఒక ట్వీట్‌ వివాదాస్పదమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద మైనారిటీ మహిళలు బారులు తీరి తమ గుర్తింపు కార్డులను చూపిస్తూ ఉన్న ఒక వీడియోను కర్ణాటక బీజేపీ తమ ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘గుర్తింపు కార్డులు జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్లీ ఎన్‌పీఆర్‌ సర్వేలో చూపించాల్సి ఉంటుంది’ అని రాసి ఉంది. ఈ ట్వీట్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: రచ్చరచ్చగా విజయ్‌ చిత్ర షూటింగ్‌)

సీఏఏకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ పుస్తకం
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ రాసిన ఓ పుస్తకం అమ్మకానికి పెట్టిన ఆరు రోజుల్లో 1,000 కాపీలు అమ్ముడుపోయింది. మమత రచించిన ‘నాగరికట్ట ఆతంకో’(పౌరసత్వ భయం) పుస్తకాన్ని అంతర్జాతీయ కోల్‌కతా పుస్తక ప్రదర్శనలో ఈ నెల 4న అమ్మకానికి ఉంచారు. ఈ పుస్తకంలో రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో భారత్‌లో అనిశ్చితి గురించి ఆమె రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వ్యతిరేక  ఉద్యమం, తాజా రాజకీయాలపై తన అభిప్రాయాలను విశదీకరించారు. 

మరిన్ని వార్తలు