కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్‌

3 Nov, 2018 09:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఉపఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్‌సభ స్థానాలలో పోలింగ్ కొనసాగుతోంది. రామనగరం, జమ్‌ఖండి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. 

బీజేపీదే విజయం : యడ్యూరప్ప
ఉపఎన్నికల్లో తన కూమారుడు బీఎస్‌ రాఘవేంద్ర భారీ విజయం సాధిస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. 101 శాతం శివమొగ్గ నుంచి రాఘవేంద్ర విజయం తథ్యమన్నారు. బళ్లారిలో భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.

అందరి దృష్టి బళ్లారిపైనే
ఐదు స్థానాల కంటే బళ్లారి లోక్‌సభ ఉపఎన్నికపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా..నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్పకు మద్దతుగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న జే. శాంతకు మద్దతుగా ఆయన సోదరుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు  బీ. శ్రీరాములు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు. రెండూ పార్టీలు ఇక్కడ తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు