బాబుతో అప్రమత్తంగా ఉండాలి: కర్నె ప్రభాకర్‌

6 Oct, 2018 02:01 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభ తగ్గిందని సర్వేలు చెబుతున్నాయని.. అక్కడ ముఖ్యమంత్రి పదవి పోతుండటంతో తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తు న్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. తెలం గాణ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు.

టీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లను ఏపీ ఇంటెలిజెన్స్‌ వాళ్లు ఎందుకు ట్యాప్‌ చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపైనో హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందలేదని, చంద్రబాబు కట్టిన హైటెక్‌ సిటీ గబ్బిలాల మందిరంగా తయారైందని చెప్పారు. చంద్రబాబు మరోసారి తెలంగాణలో కుట్రలు చేసే ప్రమాదం ఉందనే టీడీపీతో పొత్తులు పెట్టుకోలేదు.  

రాష్ట్ర ఏర్పాటు కోసమే పొత్తు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే 2009లో టీడీపీతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని కర్నె తెలి పారు. టీఆర్‌ఎస్‌ బహిరంగసభలకు ప్రజలు భారీగా స్వచ్ఛందంగా తరలి రావడాన్ని చూసి కాంగ్రెస్‌ వాళ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయకుం డా కాంగ్రెస్‌ అడ్డుకోవడం నీతిమాలిన చర్యని, ఇది ఆడపడుచులను అవమానపరచడమేనని విమర్శించారు. మిషన్‌ భగీరథ పనులను ఆపా లని కేసు కూడా వేస్తారేమోనన్నారు. ఇలాంటి ప్రతిపక్షం భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు కీడు జరుగుతుందన్నారు.

కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు గుర్తు లేదా?
గుండు సుధారాణి
సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టినప్పుడు విజ యశాంతికి దొర పదం గుర్తుకు రాలేదా అని టీఆర్‌ఎస్‌ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. ప్రభుత్వ పథకాలు విజయశాంతికి సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చేనేత వర్గాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం బతుకమ్మ చీరల పం పిణీ చేపట్టిందని, మహిళలు కట్టుకునే చీరలపై రాజకీయం చేయడం సరికాదన్నారు.

‘తెలం గాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ. తరతరా ల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు ఆడబిడ్డలకు కేసీఆర్‌ ప్రభుత్వం చీరలను ఇస్తోం ది. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్‌ నీచ సంస్కృతి. కేసీఆర్‌ అమలు చేసిన ప«థకాలను, ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి’ అని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు