కమీషన్ల కోసమే ‘ప్రైవేట్‌’కు వత్తాసు

23 Dec, 2017 02:55 IST|Sakshi

కాంగ్రెస్, టీడీపీలపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: కమీషన్లపైన కక్కుర్తితోనే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రైవేట్‌ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీల నేతలు ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్య ను అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కేసీఆర్‌ సర్కారు కృషి చేస్తోందని తెలిపారు.

ఉమ్మడి పాలనలో ప్రభుత్వ విద్య తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కార్పొరేట్‌ విద్యా సంస్థల హవాతో తల్లిదండ్రులు భూములను తాకట్టు పెట్టి పిల్లలను చది వించుకోవాల్సిన దుస్థితి ఉండేదని దెప్పిపొడిచారు. నారాయణ విద్యా సంస్థలతో కార్పొరేట్‌ విద్యకు తలుపులు బార్లా తెరిచింది తెలుగుదేశం ప్రభుత్వమే నని, వాటి అధిపతి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశా రు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు