ఆయనకి టిక్కెట్‌ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం..

15 Nov, 2018 15:45 IST|Sakshi

కార్తీక్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన

సాక్షి, రాజేంద్రనగర్‌ : రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి భంగపడిన సంగతి తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఆ టికెట్‌ టీడీపీకి కేటాయించారు. మీ నేపథ్యంలో కార్తీక్ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలంటూ ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. శంషాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

 పొత్తు పేరు చెప్పి టీడీపీ దరిద్రం కాంగ్రెస్ కు అంటించారని  ఉత్తమ్ కుమారెడ్డిపై నిప్పులు చెరిగారు. 40 మంది కార్యకర్తలు కూడా లేని టీడీపీకి రాజేంద్రనగర్‌ సీటు కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతోందనీ, కాలాన్ని వృధా చేయకుండా కార్తీక్ రెడ్డికి టికెట్ కోసం వేలాదిగా గాంధీభవన్ ముట్టడించాలని మన పోరాటం ఢిల్లీకి తాకి పునరాలోచించాలని కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాజేంద్ర నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు శ్రీనివస్ గౌడ్‌ అధ్యక్ష పదవికి రాజీనామచేశారు.

 కార్తీక్ రెడ్డికి టికెట్  ఇస్తే లక్ష ఓట్లతో రాజేంద్ర నగర్ గెలుస్తారు. లేదంటే ప్రచాకటరకమిటీ సభ్యత్వంతో సహా అన్ని పదవులకు కార్తీక్ రెడ్డి ,రాజేంద్రనగర్ కార్యకర్తలు రాజీనామా చేస్తామని, కూర్చొని మాట్లాడితే కాదు, రోడ్లపైకి వెళ్లి ఎక్కడిక్కడ స్తంభింపచేయాలని ఇంతమంది కార్యకర్తలను రోడ్డు మీద పడేసినందుకు ఉత్తమ్ కుమారెడ్డికి ధన్యవాదాలని ఎద్దెవ చేశారు. కార్తీక్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకున్నా ఆయనవెంటే ఉంటామని ప్రకటించారు,ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సైతం సిద్దపడాలని అవసరమైతే సబితమ్మ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా ఇద్దరు బరిలో నిలవాలని ఇద్దరినీ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు