కొత్త చరిత్రకు నేడే శ్రీకారం: మోదీ

31 Oct, 2019 11:27 IST|Sakshi

పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ

గాంధీ నగర్‌: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా అక్కడ నూతన అధ్యాయం ప్రారంభంకాబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనేక రాజకీయ ఒడిదొడుకులు, మత కల్లోలాలు ఎదుర్కొన్న కశ్మీర్‌ నేటి నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. కశ్మీర్‌ కొత్త చరిత్రను నేడు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ 144వ జయంతి సందర్భంగా గుజరాత్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. పటేల్‌ స్ఫూర్తితోనే కశ్మీర్‌ విముక్తి జరిగిందని మోదీ గుర్తుచేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌కు శాపంగా మారిన ఆర్టికల్‌ 370 వల్ల ఉగ్రవాదం పెద్ద ఎత్తున బలపడింది. ఉగ్రవాదులకు  భారత్‌లో కశ్మీర్‌ అడ్డాగా మారింది. గడిచిన మూడు దశాబ్దాల్లో 40 వేలకు పైగా కశ్మీరీ పౌరులు ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కోల్పోయారు. వారి చర్యల కారణంగా హిమాలయ భూమి రక్తపాతంగా మారింది. భవిష్యత్తులో ఉగ్రవాద సమస్యను పూర్తిగా నిర్మూలించే సంకల్పంతోనే ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. ఈ నిర్ణయాన్ని యావద్దేశం స్వాగతించింది.’ అని అన్నారు.ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ అప్పట్లో రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి ఓకే చెప్పగా.. పటేల్‌ జయంతి అయిన నేటి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో 173 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మూ కశ్మీర్‌ కథ ఇక గతం. జమ్ము కశ్మీర్, లదాఖ్‌ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్‌ అవతరించాయి.  జమ్మూ కశ్మీర్‌ కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) గా ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చంద్ర ముర్ము, లదాఖ్‌ ఎల్‌జీగా ఆర్‌కే మాథూర్‌లను కేంద్రం నియమించింది. గురువారం శ్రీనగర్, లేహ్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్స్‌ పదవీ ప్రమాణం చేశారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కవిత రాజకీయ భవిష్యత్తు ఏమిటి?

ఏపీ సీఎం జగన్‌ సక్సెస్‌ అయ్యారు: కేశినేని నాని

సీపీఐ నేత గురుదాస్‌ గుప్తా ‍కన్నుమూత

ఉక్కుమనిషికి ఘన నివాళి..

మీ‘బండ’బడ.. ఇదేం రాజకీయం! 

చంద్రబాబు రాజకీయ దళారీ

పగ్గాలు ఎవరికో?

కేంద్ర ప్రభుత్వంలో చేరుతాం: జేడీయూ

తేరే మేరే బీచ్‌ మే

ఉత్తమ్‌కు కేసీఆర్‌ దెబ్బ రుచి చూపించాం

అవసరమైతే మిలియన్‌ మార్చ్‌!

‘పవన్‌ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’

ఆర్టీసీ సమ్మె : ‘వారు జీతాలు పెంచాలని కోరడం లేదు’

ఆర్టీసీ సమ్మె : ‘మేనిఫెస్టోలో కేసీఆర్‌ ఆ విషయం చెప్పారా’

ధ్యానం కోసం విదేశాలకు పోయిండు!!

కశ్మీర్‌లో.. మహాపాపం చేశారు!!

నో సీఎం పోస్ట్‌: 13 మంత్రి పదవులే ఇస్తాం!

తెలుగుదేశం పార్టీలో ఎవరూ మిగలరు...

చంద్రబాబు రాజకీయ దళారి...

‘కామెడీ స్కిట్‌లా లోకేష్‌ ఐదు గంటల దీక్ష’

‘కశ్మీర్‌ మన అంతర్గత విషయం కాదా?’

కేశినేని నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలి..

‘మహా’ రాజకీయం: వ్యంగ్య కార్టూన్‌!

కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌ల షాక్‌లు

బీజేపీ మదిలో గత కాలపు జ్ఞాపకాలు

ఏపీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం..

కుమార కాషాయ రాగం

టీడీపీది ముగిసిన చరిత్ర

అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిసారిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌