కశ్మీర్‌కు హిందూ సీఎం కావాలి : స్వామి

9 Jul, 2018 17:29 IST|Sakshi
సుబ్రహ్మణ్య స్వామి (ఫైల్‌ ఫోటో)

పీడీపీ సహకరిస్తే హిందూ వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటాం: సుబ్రహ్మణ్య స్వామి

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) హిందూ లేదా సిక్కు వ్యక్తిని సీఎంగా ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కశ్మీర్‌కు కేవలం ముస్లిం వ్యక్తే సీఎంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారని, దానికి స్వస్తి పలికి హిందూ వ్యక్తి సీఎం కావాలని స్వామి పేర్కొన్నారు.

ముస్లిం వ్యక్తి తప్ప ఒక్క హిందూ వ్యక్తి కూడా ఇంత వరకు సీఎంగా ఎన్నుకోలేదని, పీడీపీ సహకరిస్తే తామూ చేసి చూసిస్తామని తెలిపారు. కాగా జూన్‌ 19న పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మద్దతు విరమించుకోవడంతో సీఎం మహబూబా ముప్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించారు.

మరిన్ని వార్తలు