ట్విట్టర్ పార్టీలో.. కులపిచ్చిగాళ్లు : కత్తి మహేష్

9 Dec, 2017 16:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:
జ‌న‌సేన అధిన‌తే ప‌వ‌న్ కళ్యాణ్ పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మరోసారి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తూ ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్యలపై క‌త్తి మ‌హేష్ ఘాటుగా స్పందించారు. తన ఫేస్ బుక్ పేజీలో వరుస పోస్టులతో పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడులపై ధ్వజమెత్తారు. కత్తి మహేష్ ఏమన్నారంటే..

జనసేన ఓ ట్విట్టర్ పార్టీ..
రూల్స్ ప్రకారం చూసుకుంటే, జనసేన అసలు పార్టీనే కాదు. కేవలం ట్విట్టర్ పార్టీ. రాజకీయ పార్టీ అవ్వడానికి కావలసిన కనీస అర్హతలు లేని పార్టీ. చంద్రబాబు గారు దయతో కొన్ని సీట్లు కేటాయించి, వచ్చే ఎన్నికల్లో అయినా జనసేన కి పార్టీ హోదా కల్పించకపోతే, మరో జెనరేషన్ యూత్ వెర్రి వెంగలప్పలుగా మిగిలిపోతారు. జనం లేరు. సేన లేదు. పిచ్చి అభిమానులు. కుల పిచ్చిగాళ్ళు మాత్రం ఉన్నారు.

మేము రెడీ అంటే, ముందు నేను పోరాడతా అంటావ్...
స్పెషల్ స్టేటస్ అంటే జోకైపోయింది. వైజాగ్ రమ్మని పిలుపినిచ్చావ్. నువ్వు మాత్రం రాలేదు. మీ దోస్త్ చంద్రబాబు స్పెషల్ ప్యాకేజికి, స్టేటస్ కి తేడాలేదు అనేస్తాడు. నువ్వు మళ్ళీ స్టేటస్ కావాలంటే పోరాడాలి అంటావు. మేము రెడీ అంటే, ముందు నేను పోరాడతా అంటావ్. అసలు ఒక్క విషయం మీద అయినా క్లారిటీ ఉందా! ఆ క్లారిటీ లేదనే విషయం అయినా క్లియర్గా అర్థం అవుతోందా?!

చంద్రబాబును ఎలా వెనకేసుకురావాలో ఆర్థం కావడం లేదా?
ప్రతిదానికీ 'చంద్రబాబు కి తెలియకపోవచ్చు' అంటావేంటయ్యా బాబూ... ఆయన ముఖ్యమంత్రి కాడా, లేక అంత పనికిమాలినవాడు అని నీ అభిప్రాయమా!? లేక ఎలా వెనకేసుకు రావాలో నీకు అర్థం కావడం లేదా! మంచి కన్సల్టెంట్లను, అడ్వైజర్లను పెట్టుకో. నన్ను ఏమైనా ఈ విషయంలో సలహాలివ్వమంటే ఇస్తా.

ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రిజైన్ చెయ్యాలో..
నిజమే...ఎక్కడో రైలు దుర్ఘటన జరిగితే లాల్ బహుదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. ఇలా అయితే చంద్రబాబు ఎన్ని సార్లు రిజైన్ చెయ్యాలో. ఒకసారైనా రిజైన్ చెయ్యమని కోరకూడదా పవన్ కళ్యాణ్!.. అంటూ మహేష్ కత్తి నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు