పొంగులేటి నా ఇంట్లో వ్యక్తి లాగా : కేసీఆర్‌

4 Apr, 2019 19:43 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ప్రజలు కష్టాలు తొలగాలని.. దారిద్ర్యం వదలాలనే ఉద్దేశంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ను తీసుకువచ్చానని ముఖ్యమం‍త్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గురువారమిక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. ఈ రోజు అనుభవిస్తున్న దరిద్రానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న జాతీయపార్టీలకు దేనికి కూడా సొంతంగా గెలిచే శక్తి లేదని ఎద్దేవా చేశారు. మోదీ నల్లధనాన్ని తీసుకొచ్చి ఇస్తా అన్నాడు.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నేటికీ సగం దేశం చీకట్లోనే ఉందని విమర్శించారు. ఈ ఎన్నిక దేశగతిని మార్చుతుంది.. మార్చాలని కోరారు. ఇవి రోటిన్‌ ఎన్నికల కాదని స్పష్టం చేశారు.

ఎలాంటి శషబిషలు లేకుండా ఖమ్మం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరావును గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏమవుతారో తెలియదన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని తన ఇంట్లో వ్యక్తిలాగా అని పేర్కొన్నారు. భవిష్యత్తులో పొంగులేటి, తుమ్మల సేవలను వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరిని ఖచ్చితంగా సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పేదలందరికి ఖచ్చితంగా డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చి తానే సూపర్‌వైజ్‌ చేస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు